ఎమ్మెల్యే సంజయ్ అక్రమ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్ నాయకులు..

viswatelangana.com
రాష్ట్రంలో దిగజారిన వైద్య ఆరోగ్య పరిస్థితులపై త్రిసభ్య కమిటీలో భాగంగా తాటికొండ రాజయ్య అధ్యక్షతన హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు ఆసుపత్రిలు సందర్శించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న భాగంలో… కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య లను అరెస్టు చేయడం కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దు పోకడకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆసుపత్రిని బీఆర్ఎస్ డాక్టర్ల బృందం సందర్శించడానికి వెళ్తే ఎందుకు అరెస్ట్ చేయించారో వివరణ ఇవ్వాలని తెలిపారు.. ఇప్పటికే 10 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను పలుమార్లు హౌస్ అరెస్టులు, అక్రమ అరెస్టులు చేసి రిమాండ్ చేసారని ఇలాంటి అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులకు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా భయపడరాని, ఎన్నో ఉద్యమాలు చేసి అరెస్టులకు గురై తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు..



