Localవేములవాడ

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

viswatelangana.com

February 4th, 2024
Local (విశ్వతెలంగాణ) :
వేములవాడ (విశ్వతెలంగాణ) :

రాజన్న సిరిసిల్ల జిల్లా: క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం తంగళ్ళపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో రాళ్లపేట ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శరీర దారుఢ్యంతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని, క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరూ గెలుపు ఓటములను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. క్రీడల్లో ముందుకు సాగాలంటే సాధననే ముఖ్యమని తెలిపారు..

Related Articles

Back to top button