విశ్వ శాంతి హై స్కూల్లో వీడ్కోలు హంగామా
viswatelangana.com
కోరుట్ల పట్టణం లోని విశ్వ శాంతి హై స్కూల్లో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తాము విద్యను అభ్యసించిన పాఠశాలలోని మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ చక్కని నృత్యాలతో అతిథులను అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బ్రహ్మన్న గారి శంకర్ శర్మ ప్రిన్సిపాల్ చీటీ సత్యం రావు మరియు ప్రధాన వక్త బట్టు హరికృష్ణ లు మాట్లాడుతూ విద్యను అర్థించే వాడు విద్యార్థి అని విద్యను అభ్యసించి ఉత్తమ విద్యార్థులుగా మారాలంటే ముందుగా సహకరించే వారు తల్లి దండ్రులు అలాంటి వారిని మర్యాద పూర్వకంగా గౌరవించాలి వారు చెప్పిన బాటలో నడవాలని సూచించారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని ఉపాధ్యాయులు ఇచ్చే సూచనలు తీసుకొని మంచి మార్గాన్ని ఎంచుకొని ఉత్తమ ర్యాంకులు సాధించి మీ పాఠశాలకు పేరుతేవాలని మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల డైరెక్టర్లు గంగి శెట్టి కృష్ణ, కటుకం రాజేష్ మరియు విద్యార్థుల తల్లి దండ్రులు పాల్గొన్నారు



