కోరుట్ల

ఉద్యోగంలో కూడా అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి

ఏ.ఈ.ఈ ఉద్యోగం సాధించిన మణిరాజ్ కు ఘన సన్మానం

viswatelangana.com

August 17th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

ఉద్యోగంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని, పేద ప్రజలకు సేవలు అందించాలని ఆల్ ఇండియా సంఘ నాయకులు కోరారు. గత కొన్ని రోజుల క్రితం రాష్ట్రంలో వెలుబడిన అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల నియామకంలో జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని చంటి మణిరాజ్ ఉద్యోగం సాధించిన సందర్భంగా ఘనంగా సన్మానించారు. శనివారం పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ సన్మాన కార్యక్రమాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఉద్యోగాలు సాధించినా యువకులను శాలువాలతో ఘనంగా సన్మానం చేసి, సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… యువత విద్యపై దృష్టి సారించాలని, చెడు వ్యసనాలకు బానిసలు కాకూడదని కోరారు. ఏరంగంలో రాణించాలన్న ప్రతి వ్యక్తికి విద్య ఎంతో అవసరమని తెలిపారు. యువత అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేయాలని కోరారు. తమ ప్రాంతం నుండి ఏ.ఈ.ఈ ఉద్యోగాలు పొందడం తమకెంతో గర్వకారణమన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఆయన చూపిన మార్గంలో పేదలకు న్యాయం జరిగేలా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర నాయకులు ఉయ్యాల నరసయ్య, బలిజ రాజారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఉయ్యాల శోభన్, పసుల కృష్ణ ప్రసాద్, కంభ ఆనంద్, మ్యాకల మహేష్, సామల వేణుగోపాల్, పసుల చిన్నయ్య, సామల గంగ నరసయ్య, మగ్గిడి వెంకటి, సామల దశరథం, సామల రాజనర్సయ్య, ఎడ్ల ప్రభాకర్, చంటి, చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button