కొడిమ్యాల

ఉపాధిని కోల్పోతున్న విశ్వకర్మలు…

విశ్వకర్మల చేతి వృత్తి ఉపాధిని కోల్పోతూ వలసల బాట పడుతున్నారు.

viswatelangana.com

October 24th, 2024
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

విశ్వకర్మ లలో ఐదు రకాల వారు తమ ఉపాధిని కోల్పోతూ గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్తున్నారు. ఆధునిక యుగములో ప్రజలు కొత్తరకాలకు అలవాటుపడి రెడీమేడ్ వస్తువులతో వృత్తి పనులకు గిరాకీ లేకుండా అవుతుంది. వన్ గ్రామ్ గోల్డ్ రెడీమేడ్ జ్యువెలరీ లతో స్వర్ణకారులు పనులు కోల్పోతున్నారు. వడ్రంగి వృత్తి వారు దారుణమైన పరిస్థితిలు ఎదుర్కొంటున్నారు, అల్యూమినియం , ప్లవుడు, ఇంటీరియర్ డెకరేషన్ వంటి కొత్త ప్రోకడలతో వారి పనులే కరువుతున్నాయి. ఇక వీరి మీద అటవీ శాఖ అధికారుల దాడులు అధికారుల దాడులు మరి దారుణం. కొన్ని సందర్భాల్లో ఇల్లలోని ప్రతి రూములలో చివరికి బాత్రూంలో కూడా తనిఖీ చేస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దాదాపుగా 95 శాతం మంది అటవీ శాఖ పర్మిట్ కలపతోనే పనులు చేస్తున్నారు. పర్మిట్ ఉన్నా కానీ వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ఇబ్బందులు భరించలేక చాలామంది గల్ఫ్ దేశాలకు ప్రయాణమవుతున్నారు. అలాగే మిగిలిన కమ్మరి కంచర శిల్పులు కూడా వారి వారి చేతి వృత్తులను కోల్పోతున్నారు. వీరు పనులు చేస్తున్న క్రమంలో చాలా గాయాల పాలవుతున్నారు, అనారోగ్యానికి గురవుతున్నారు, కొందరు వికలాంగుల అవుతున్నారు. ఇట్టి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. గీత కార్మికులు నేత కార్మికుల లాగా విశ్వకర్మ లకు చేతి వృత్తి పెన్షన్ ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేస్తున్నారు

Related Articles

Back to top button