కోరుట్ల మా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

viswatelangana.com
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు మా ప్రెస్ క్లబ్ వద్దకు వచ్చి జెండా ఆవిష్కరించారు అనంతరం ప్రజలకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మా ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. గత మూడు సంవత్సరాల నుండి మా ప్రెస్ క్లబ్ విలేకరులు ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన వార్తాకథనాలు అందిస్తున్నారని, ఎల్లవేళలా మా ప్రెస్ క్లబ్ విలేకరులు అందరు కూడా ఇలాగే ప్రజా సమస్యలపై పరిష్కారానికి మంచి వార్త కథనాలు అందించాలని కోరారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కోరుట్ల పట్టణంలోని మా ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షులు చిలువేరి లక్ష్మీరాజం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు కి స్వీట్ తినిపించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు తనయులు జువ్వాడి నరసింగ రావు మరియు జువ్వాడి కృష్ణారావులు తండ్రికి తగ్గ తనయలుగా కోరుట్ల నియోజకవర్గంలో సేవలందిస్తున్నారని ఇది చాలా ఆనందదాయకమని మా ప్రెస్ క్లబ్ పక్షాన తెలియజేశారు. మా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చిలువేరి లక్ష్మీరాజం, ఉప అధ్యక్షుడు ముక్రం బేగ్, జనరల్ సెక్రెటరీ పెడిమల్ల రాజు, జాయింట్ సెక్రెటరీ మొహమ్మద్ జాకీర్ హుస్సేన్, ఆర్గనైజర్ సెక్రెటరీ మొహమ్మద్ రఫీ, నరేష్. మొహమ్మద్ ఖలీల్ పాషా, సాంబారి మహేష్. మహమ్మద్ సాదిక్ అలీ, విలేకరులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.



