సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరం
viswatelangana.com
లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల కోటి నవదుర్గ వారి ఆధ్వర్యంలో ఆడేపు మధు -కమల సహకారంతో వినాయక డెంటల్ కేర్ హాస్పిటల్ డాక్టర్ ఆడెపు అనురాగ్ ఎం డీ ఎస్ సౌజన్యంతో శ్రీ సరస్వతి శిశు మందిరం పాఠశాలలో ఉచిత దంత వైద్య పరీక్షల శిబిరం నిర్వహించడం జరిగింది. ఇట్టి సందర్భముగా సుమారు 300 మంది పిల్లలకు దంత సమస్యల పట్ల అవగాహన కల్పిస్తూ వారికి అవసరమైన మందులు, టూత్ బ్రష్ లు, పేస్ట్ లు మౌత్ వాష్ లు ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఇరు క్లబ్ ల అధ్యక్ష కార్యదర్శులు వనపర్తి చంద్ర మోహన్ – రమ్య, కుందారపు మహేందర్ – ప్రేమలత, ట్రేసరర్ కొండబత్తిని రాధిక కృష్ణ జోన్ ఛైర్మెన్ అల్లాడి శోభ ప్రవీణ్, క్లబ్ సీనియర్ నాయకులు డాక్టర్ గండ్ర దిలీప్ రావ్, ఆడేపు మధు – కమల, ఎలిమిళ్ళ ఉషా కిరణ్, గుంటుక సురేష్ బాబు, ఏలేటి లక్ష్మారెడ్డి, పొలాస రవీందర్ – గీత, రుద్ర సుజాత, పాఠశాల కోశాధికారి నీలి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ గోపు వెంకటేష్, కొండ బత్తిని అమర్నాథ్, ఆడేపు ఆనంద్, విద్యార్థులు, వారి తల్లి దండ్రులు తదితరులు పాల్గొన్నారు.



