భీమారం
గుగ్గిళ్ళ గంగారం కుటుంబాన్నిపరామర్శ

viswatelangana.com
June 22nd, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా భీమారం మండలం రాజలింగంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గుగ్గిళ్ళ గంగారం తండ్రి గుగ్గిళ్ళ ఎర్రన్న ఇటీవల మరణించాడని తెలుసుకున్న వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గుగ్గిళ్ళ ఎర్రన్న కుటుంబ సభ్యులను శనివారం రోజున పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే వెంట భీమారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏనుగు రమేష్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మార్గం నరసారెడ్డి, నీరేటి మల్లేశం, తునికి ఆదిరెడ్డి, బండపెల్లి సంజీవ్, తోకలా గంగ నర్సయ్య, రదారపు మల్లేశం, పాసపు శ్రీనివాస్, సుంకపాక రాజు, నేరెళ్ళ సత్తయ్య, జడ నడ్పి గంగారాం ఉమ్మడి మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు ఉన్నారు.



