కోరుట్ల

అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాసం…

పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్

viswatelangana.com

June 13th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణ 13వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ విచ్చేసి విద్యార్థులతో అక్షరాలు దిద్దించారు. అనంతరం చేపట్టిన బడిబాట కార్యక్రమంలో తిరుమల గంగాధర్ మాట్లాడుతూ… అంగన్వాడి కేంద్రాల్లో పోషణతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మూడు నుంచి ఆరేళ్ల పిల్లల నమోదు ఫ్రీ స్కూల్ హాజరు పెంచడం, ప్రైవేటుకు ధీటుగా అంగన్వాడీ కేంద్రం బడులలో పూర్వ ప్రాథమిక విద్య బలోపేతానికి సిలబస్ రూపొందించారని, ఆటపాటలతో పిల్లలకు విద్యా సృజనాత్మక వెలికి తీయడం జరుగుతుందన్నారు. అంగన్వాడిలోని పిల్లలకు ప్రభుత్వం యూనిఫాంలో ఆటవస్తులు ఫర్నిచర్ మ్యాట్లు ప్రియదర్శిని పుస్తకాలు అందిస్తుందన్నారు. అంగన్వాడి బడి ద్వారా మెరుగైన సేవలు అందజేస్తుందని తల్లిదండ్రులు దగ్గర నుండి అంగన్వాడిలో పిల్లలు చేర్పించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుమల గంగాధర్ తో పాటు అంగన్వాడీ కేంద్ర నిర్వాహకులు, చిన్నారులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button