ఘనంగా జన హృదయ నేత డాక్టర్ వైఎస్ఆర్ జయంతి

viswatelangana.com
కథలాపూర్ మండల కేంద్రంలో జన హృదయ నేత డాక్టర్ వై ఎస్ ఆర్ జయంతి ఉత్సవాలను కథలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాయితి నాగరాజు ఆధ్వర్యంలో డాక్టర్ వై ఎస్ ఆర్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాయితి నాగరాజు, పిసిసి సభ్యుడు తొట్ల అంజయ్య లు మాట్లాడుతూ ఆయన 29 ఏళ్ల కే ఎమ్మెల్యే గా, 35 ఏళ్లకే పిసిసి చీఫ్ గా, 5 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ఎంపీగా, 2 సార్లు సీఎం గా చేశారని, జలయజ్ఞం, ఉచిత విద్యుత్, ఫీజు రియింబర్స్మెంట్, ప్రాజెక్ట్ లు, రాజీవ్ యువశక్తి, 1 రూ. కి కిలో బియ్యం, పావలా వడ్డీకే రుణాలు, బడిబాట, రచ్చబండ లాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారని అన్నారు. ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి, చెదలు సత్య నారాయణ, వెలిచాల సత్యనారాయణ, పులి హరిప్రసాద్, శ్రీహరి, జవ్వాజి రవి, పంబాల శంకర్, లింగా గౌడ్, ఆకుల సంతోష్, అంబటి రాధకృష్ణ, అఫీజ్, లింగారావు, మహేష్, బోదాసు నర్సయ్య, మెయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


