రాయికల్

ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

viswatelangana.com

January 25th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం రోజున జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా జాతీయ ఓటర్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఎన్నికల విధానము అవగాహన కోసము పాఠశాలలో నమూనా ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తాసిల్దార్ ఎం ఏ ఖయ్యూం విద్యార్థుల చేత ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. 18 సంవత్సరాలు నిండిన ముగ్గురు యువకులకు ఓటర్ గుర్తింపు కార్డులను అందజేశారు. మరొక ముఖ్య అతిథి మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రాధాన్యతను వివరిస్తూ, ప్రతి ఒక్కరు ఓటును సద్వినియోగం చేసుకోవాలని మరియు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మునిసిపల్ వైస్ చైర్మన్ శ్రీమతి గండ్ర రమాదేవి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా తమ పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. కౌన్సిలర్ మేకల అనురాధ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి ఓటర్లు కాబట్టి పాఠశాల స్థాయిలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థులకు ఎన్నికల విధానం గురించి పూర్తిస్థాయి అవగాహన కలుగుతుందని అన్నారు. మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులు మాట్లాడుతూ విద్యావంతులను మరియు సమాజం పట్ల అవగాహన ఉన్న వారిని మాత్రమే ఎన్నికలలో ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పొన్నం రమేష్, రవీందర్, మల్లేశం, సత్యనారాయణ, గంగ జమున, నాగరాజు, తిరుమల గంగాధర్, వనిత, పారిపెల్లి గంగాధర్, పద్మజ, యాస్మిన్, ఫాతిమా, శ్రీకాంత్, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button