జగిత్యాల
ఇంటి సరిహద్దుల విషయం లో ఇరువర్గాల మధ్య గొడవ

viswatelangana.com
May 15th, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలానికి చెందిన గుంజపడుగు గ్రామంలో ఇంటి సరిహద్దుల విషయంలో ఇరు వర్గాల మధ్య పెద్దగొడవ నెలకొంది. గ్రామానికి చెందిన గంధం సిద్ధూ, సమ్మయ్య, అంజి, సతాలం గట్టన్న ,గంధం కుమార్, పాస్టo శారద ల పైన అదే గ్రామానికి చెందిన కళ్లెం తిరుపతి ఆయన వర్గీయులు 30 మంది అందరూ కలిసి బుధవారం రోజున పార, గడ్డపార, గొడ్డలి లాంటి పదునైన పనిముట్లతో దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వీరిని జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.గొల్లపల్లి మండలం లోని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన పోలీసులు పట్టించుకోలేదంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.



