భీమారం

పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అందజేసిన పూర్వ విద్యార్థులు

viswatelangana.com

March 15th, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :

భీమారం మండల కేంద్రంలోని భీమారం ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు వచ్చే సోమవారం నుండి జరగబోయే పబ్లిక్ పరీక్షలకు అదే పాఠశాలలో చదువుకున్న 2018-19 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు ఎగ్జామ్ ప్యాడ్, పెన్నులను అందజేశారు. పదవ తరగతి హాల్ టికెట్లను, పరీక్ష సామాగ్రిని పాఠశాలలోని సరస్వతి మాత ముందు ఉంచి సరస్వతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2018 -19 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించడం జరిగింది. అలాగే పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లను అందజేస్తూ పరీక్ష రాసే విధానంపై సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులుఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Articles

Back to top button