ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (ఐఎల్పిఏ) ఆధ్వర్యంలో ఓబీసీ న్యాయవాదుల సమావేశం

viswatelangana.com
2024 ఆగస్ట్ 25న జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియం, మాసబ్ ట్యాంక్ హైదరాబాద్ నందు తెలంగాణ రాష్ట్ర స్థాయి బీసీ న్యాయవాదుల సదస్సును విజయవంతం చేయడానికి గాను ఐఎల్పిఏ తెలంగాణ స్టేట్ అధ్యక్షులు పొన్నం దేవరాజు గౌడ్ అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు దయ్య రాజారాం, ఐఎల్పిఏ జగిత్యాల జిల్లా అధ్యక్షులు మగ్గిడి నర్సయ్య, ఐఎల్పిఏ జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పసియుద్దిన్, ఐఎల్పిఏ జగిత్యాల జిల్లా జనరల్ సెక్రెటరీ కుంచాల రామకృష్ణ ఆధ్వర్యంలో పాంప్లేట్ ను ఆవిష్కరించి జగిత్యాల జిల్లా నుండి పెద్ద ఎత్తున బీసీ న్యాయవాదులు అందరూ… తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర ఐఎల్పిఏ నాయకులు లక్ష్మి, సుమలత, ఆంజనేయులు, నరహరి, కోరుట్ల బార్అసోసియేషన్ అధ్యక్షులు తన్నీరు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు తోట ఆంజనేయులు, సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.



