రాయికల్
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

viswatelangana.com
March 23rd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలోని సుమారు 320 పశువులకు గాలి కుంటు వ్యాధి వ్యాధి నివారణ టీకాలు వేసినట్లు అదనపు పశువైద్య అధికారి డాక్టర్ నరేష్ గారు తెలియజేసారు. గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు 3 నెలల వయసు దాటిన ప్రతీ పశువుకు వేయించుకోవాలి అని డాక్టర్ నరేష్ గారు తెలియజేసారు. వేసవి కాలంలో పశువులలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రైతులకు సూచించారు. ప్రధానంగా గాలికుంటు వ్యాధి, దూడలలో పారుడు రోగము, గొర్రెలు, మేకలలో షీప్ పాక్స్, ఇతర చర్మ సంబంధ వ్యాధులు వస్తాయి అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రైతులు రాజేశ్ , కోప్పల గంగారాం, ఏంబారి సాయి రెడ్డి, అంజయ్య, సహదేవ్, హరిష్, పశువైద్య సిబ్బంది, పోచయ్య, బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.



