చికాగో అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిద్దాం

viswatelangana.com
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎం ఎ చౌదరి, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జి. తిరుపతి నాయక్
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మే 01 కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కోరుట్ల బస్టాండ్ ఇన్ గెట్ పక్కన భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయు )ఆధ్వర్యంలో, వ్యవసాయం మార్కెట్ హమాలి యూనియన్ ఆధ్వర్యంలో జెండాలు ఎగరవేసి మే డే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతి నాయక్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎంఎ చౌదరి, మాట్లాడుతూ వెట్టిచాకిరికి వ్యతిరేకంగా బానిసత్వానికి వ్యతిరేకంగా కార్మికుల హక్కుల సాధన కోసం చికాగోలో జరిపిన ఉద్యమ స్ఫూర్తితో నేడు బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి పిలుపునిచ్చారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యవసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగాయని, కార్మిక చట్టాలను తుంగలో తొక్కి, 4 నూతన లేబర్ కోడులను తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులకు శాపంగా మారిన నల్ల చట్టాలను తెచ్చి 750 మంది రైతుల చావుకు బిజెపి కారణమైందని అన్నారు. బిజెపికి దేశభక్తి లేదని దేశాన్ని దోచుకోవడమే వారి లక్ష్యమని రానున్న ఎన్నికల్లో కార్మికులు ఆలోచన శక్తితో రైతు కార్మిక ప్రజా వ్యతిరేక బిజెపికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. బ్రిటిష్ హయంలో జుట్టు పన్ను మాదిరిగానే బిజెపి ప్రభుత్వంలో జిఎస్టి రూపంలో పిల్లలు తాగే పాలు పెరుగు నిత్యవసర వస్తువులపై 18 శాతం జీఎస్టీలు వేసి పేదల ఉసురు తీసుకుంటుందని అన్నారు. చివరికి చనిపోయాక కూడా శవపేటికల పైన పనులు వేస్తూ బ్రిటీష్ వారిని మించిపోయారని ఎద్దేవా చేశారు. ప్రజలందరూ ఐక్యంతో బ్రిటిష్ వారిని తరిమినట్టుగానే బిజెపి వారిని గద్దె, తగిన గుణపాఠం చెప్పాలని, నైజాం నవాబులను ఎదుర్కొని వీర తెలంగాణ సాయుధ పోరాటం నడిపిన ఎర్రజెండా చరిత్రను వక్రీకరిస్తూ కొన్ని పార్టీలు కార్మిక దినోత్సవం రోజు రాజకీయ జెండాలను ఎగురవేయడం సిగ్గుచేటు అన్నారు. కార్మికుల రక్తంలో తడిచిన ఎర్రజెండాను అవమానిస్తే చూస్తూ ఊరుకోమని కుల మతాలకు పార్టీలకు అతీతంగా ఎవరైనా ఎర్రజెండాను ఎగరవేయాల్సిందేనని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాలు జరుపుకునే ఏకైక పండుగ కార్మిక దినోత్సవమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం.మైపాల్ నాయక్, తెలంగాణ భవన నిర్మాణ కార్మిక యూనియన్ (సీఐటీయు)జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు కుంచం శంకర్, వర్ర చంద్రయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఎ . విజయ్, అభితేజ మరియు వ్యవసాయ మార్కెట్ హమాలి యూనియన్ మల్లయ్య, ఎర్ర సాయిలు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.



