కోరుట్ల
చికెన్, మటన్ దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు

viswatelangana.com
September 22nd, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలో చికెన్, మటన్ దుకాణాలలో అలాగే కిరాణా షాపులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, వారు వినియోగిస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను స్వాధీన పరుచుకొని 2 వేల 5 వందల రూపాయలు జరిమాన విధించడంతో పాటు మటన్ అలాగే చికెన్ షాపులలో పరిశుభ్రతను పాటించాలని, అంతేకాకుండా బట్ట సంచుల వాడకంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ బాలే అశోక్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. దీనిని ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి మాట్లాడుతూ…సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిస్థాయిలో నిషేధించాలని అలాగే దుకాణదారులందరూ.. పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. అలాగే దుకాణదారులందరూ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని లేనియెడల భారీ జరిమానాలు విధించడంతో పాటు వాటిని సీజ్ చేస్తామని తెలిపారు.



