కోరుట్ల
రక్షాబంధన మహోత్సవం

viswatelangana.com
August 17th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల ఆధ్యర్యంలో, రాఖీ పౌర్ణమి పండుగ ను పురస్కరించుకొని రక్షా బంధన్ వేడుకలు కల్లూరు రోడ్ లో గల ఈశ్వరీయ బ్రహకుమారి విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వారు మాట్లాడుతూ మన దేశ యువత చెడు దారిలో పోకుండా కాపాడవలసిన బాధ్యత మన అందరిదీ అని, ముఖ్యముగా విద్యార్థులు చెడుకు బానిస కాకుండా వారి రక్షణకు కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అద్యక్షులు కుందారపు మహేందర్, కార్యదర్శి శ్రీగద్దే నరేంద్ర, కోశాధికారి కొమ్ముల జగపతి రెడ్డీ, జిల్లా నాయకులు అల్లాడి ప్రవీణ్, గుంటుక చంద్ర ప్రకాష్, పోతని ప్రవీణ్ కుమార్, ఆడేపు మధు, చాప కిషోర్, కొమ్ముల జీవన్ రెడ్డి, పోలాస రవీందర్, కొండబత్తిని కృష్ణ ప్రసాద్, పడాల నారాయణ గౌడ్, తునికి రాజేష్ తదితరులు పాల్గోన్నారు.



