ఘనంగా ప్రారంభమైన శ్రీ సీతారామ చంద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని రామాజీపేట గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో గురువారం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా వేద పండితులు చెరుకు రాజేశ్వర శర్మ పర్యవేక్షణలో ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకాలు గావించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు రాంగోపాల్ ఆచార్యులు, జగన్నాథ ఆచార్యుల ఆధ్వర్యంలో వేదమంత్రోచరణల మధ్య మేల తాళాల నడుమ అంకురార్పణ, యాగశాల ప్రవేశం,నవగ్రహ స్థాపన,కలశ కుండ స్థాపన చేసి,యజ్ఞ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కోలరాజు,మాజీ సర్పంచ్ వాసరి రవి,ఉపసర్పంచ్ జకిలేటి హరీష్ రావు, మాజీ ఎంపీటీసీ మోహన్ ఆలయ కమిటీ సభ్యులు భోయిని నరేందర్,యిద్ధం గంగారెడ్డి, అంబల్ల జీవన్ రెడ్డి,అనుపురం సత్యం గౌడ్,చల్ల రాజేందర్ రెడ్డి, అయిండ్లెని గంగారెడ్డి,లింబయ్య, గ్రామ యువకులు,నాయకులు, మహిళలు పాల్గొన్నారు.



