మెట్ పల్లి
యాసంగిలో రైతులందరు సన్నవడ్లు సాగుచేయాలి

viswatelangana.com
December 8th, 2024
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :
రైతులు సన్నవడ్లు పండించి 500 రూపాయల బోనస్ పొందాలని మెట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూనగోవర్ధన్ రైతులను కోరారు. రైతులు ఎలాంటి సందేహం లేకుండా సన్నవడ్లు సాగుచేయాలనీ సన్నవడ్ల కు 500రూపాయల బోనస్ నిరంతరం కొనసాగే పక్రియ అని డిమాండ్ ఉన్న సన్నవడ్లను సాగుచేసి లాభసాటి దిగుబడులు పొందాలని రైతులను కోరటం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో మల్లాపూర్ మండల అధ్యక్షులు కొమ్ముల చిన్న రెడ్డి, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు అందేమారుతీ, మాజీ మెట్ పల్లి మాజీ టౌన్ ప్రెసిడెంట్ ఖుతుబొద్దీన్, ఎండి జాఫర్, కాటి పెల్లి మహేష్, గోల్కొండ ప్రవీణ్, అమ్ముల పవన్ తదితరులు పాల్గొన్నారు



