జగిత్యాల
నిమజ్జనం రోజు డీజే లు మొగల్సిందేనా?
viswatelangana.com
September 8th, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణ, మండల పరిధిలోని గ్రామాలలో వినాయక నిమజ్జనం రోజు డీజే లు పెట్టాల్సిందేనని అనుకుంటున్నా వినాయక మండప నిర్వాహకులు…! డీజే యజమానులను పోలీస్ స్టేషన్ లో బైండోవర్ చేసిన సంగతి తెలిసిన ససేమిరా అంటున్నారని వినికిడి… అటు సుప్రీం కోర్ట్, ఇక్కడ పోలీస్ లు చెపుతున్నా వింటారా? అది అలా ఉంటే గ్రామాలలో ఉన్న వినాయక మండప నిర్వాహకులు కోరుట్ల, మెట్ పెళ్లి ప్రాంతాలలో వినాయక నిమజ్జనం రోజు గ్రామాలలో నిమజ్జనం చేస్తే గ్రామల వైపు పోలీస్ లు ఎవరు రారని అనుకుంటున్నారని వినికిడి! సౌండ్ పొల్యూషన్ వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయని, వినాయక నిమజ్జనం సాయంత్రం నుండి మొదలు పెడితే మల్లి తరువాతి రోజు ఏ సమయం అవుతుందో తెలియదాని అనుకుంటున్నారు.డీజే యజమానులతో పాటు వినాయక మండప నిర్వాహకులని కూడా పోలీస్ లు పిలుచుకుంటే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నట్లు వినికిడి.



