జాబు కార్డు కలిగిన ప్రతి ఒక్కరు పనులకు రావాలి

viswatelangana.com
జాబ్ కార్డులు కలిగిన కూలీలందరూ ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి చెందాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రఘువరన్ అన్నారు. గురువారం రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పర్యవేక్షించారు. ఉపాధి హామీ పనిచేస్తున్న కూలీల హాజరు నమోదు వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధి హామీ పనులను కూలీలు సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి చెందాలన్నారు.వేసవి కాలం దృష్ట్యా పని ప్రదేశంలో కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.కూలీలు చేసిన పనులకు సంబంధించిన కొలతలను పరిశీలించారు.ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం తొందరగా పనులకు రావాలని కూలీలకు సూచించారు. జగిత్యాల జిల్లా మార్చి 31 వరకు 4 లక్షల పని దినాలు చేయాలని టార్గెట్ ఉందని జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులకు రావాలన్నారు.ఫారం ఫండ్,నీటి నిల్వ కందకాలు,పర్క్యులేషన్ ట్యాంక్ హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.నర్సరీని సందర్శించి మొక్కల పెంపకంలో వేసవికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీవో సుష్మా,ఏపీవో దివ్య, పంచాయతీ కార్యదర్శి స్వర్ణ, టెక్నికల్ అసిస్టెంట్ వీణారాణి, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్,కారోబార్ ప్రశాంత్, గ్రామస్తులు, కూలీలు తదితరులు పాల్గొన్నారు.



