రాయికల్

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అల్లీపూర్ కు కంప్యూటర్ వితరణ

viswatelangana.com

June 17th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అల్లిపూర్ నందు 2004లో రిటైర్ అయిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు దివంగత కాసం మురళి జ్ఞాపకార్థం ఆయన జయంతి రోజున వారి కుమారుడు కాసం శ్రీనివాస్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ సికింద్రాబాద్ ప్యారడైజ్ ఆధ్వర్యంలో కంప్యూటర్ వితరణ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి విద్యార్థినీ విద్యార్థులకు ప్రోత్సాహంగా ఉండడానికి, డిజిటల్ ఇండియాలో భాగంగా వారు విద్య నేర్చుకోవడానికి విద్యార్థిని విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించడంలో సహాయకారిగా కంప్యూటర్, ప్రింటర్ అందించడం జరిగిందని, విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా మంచిగా చదివి ఉన్నత స్థానంలోకి రావాలని, మాలాగా భవిష్యత్తు రోజులలో ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించేటట్టుగా మీరు కూడా నిలవాలని లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ పారడైజ్ అధ్యక్షులు గణేష్ మరియు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎంపీటీసీ మోర విజయలక్ష్మి వెంకటేష్ కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంఛార్జి ప్రధానోపాధ్యాయులు గుర్రం శ్రీనివాస్ గౌడ్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ సికింద్రాబాద్ ప్యారడైజ్ సెక్రెటరీ చంద్రమోహన్, కమలాకర్, పాఠశాల ఉపాధ్యాయులు రాజేందర్, రవికుమార్, వసంతరావు, లక్ష్మి, రతిలాల్, రాజశేఖర్, ఆనంద్, మహేష్, రజిత, రాజన్న, జీవన్ రెడ్డి, వెంకట బాలమురళి, శంకరయ్య, కృష్ణ ప్రసాద్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button