రాయికల్

లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం

viswatelangana.com

March 14th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని భూపతి పూర్ గ్రామంలో గల లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయ బ్రహ్మాహోత్సవాలలో భాగంగా వినాయక ప్రతిష్ట పూజ కార్యక్రమాలు నిర్వహించి లక్ష్మీ నరసింహా స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా లక్ష్మి నరసింహ స్వామి గోవిందా అని భక్తల కీర్తనల మధ్య, బ్రాహ్మణోత్తములు వేదమంత్రాల సాక్షిగా స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరిపించారు మరియు అన్నదానం నిర్వహించారు ఈ మహోత్సవాలను చుట్టపక్కల గ్రామాలు మూట పెల్లి, వడ్డే లింగాపూర్, రాయికల్ రామాజీపేట్, చింతలూరుఇతర గ్రామల నుండి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మూడు రోజులు కన్నుల పండగ గా జరిగిన శ్రీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల ఈరోజుతో ముగియనున్నాయి ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సంకోజీ మహేష్, తాజా మాజీ సర్పంచ్ జక్కుల చంద్ర శేఖర్ వై స్ ఎంపిపి యచమనేని మహేశ్వర్ రావు, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు ముత్యం రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ అన్నవెని వేణు, అర్చకులు కాకుస్తం వెంకట కృష్ణ, వెంకట రమణ, తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button