డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంస్కరణలకు అధ్యుడు133వ జయంతి ఉత్సవాలు

viswatelangana.com
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మండలంలోని పలు గ్రామాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు తూర్తి బస్టాండ్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని అన్నారు. ప్రపంచంలో గొప్ప రాజ్యాంగాన్ని రచించి ప్రజల అవసరాలు హక్కులను తెలిపిన మహానాయకుడని, వారికి రిజర్వేషన్లు హక్కులు కల్పించడమే కాదు విధులను కూడా సూచించాడని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరికి ఎంత రిజర్వేషన్లు ఉండాలని, ఎంత వేతనాలు తీసుకోవాలో సమాజంలో ఎలా నడుచుకోవాలో రాజ్యాంగంలో క్లుప్తంగా వివరించారని కొనియాడారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి జయంతిని జరుపుకోవడం మా పూర్వ జన్మలో చేసిన పుణ్య ఫలమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ లు మాజీ ఉప సర్పంచులు వివిధ హోదాలో ఉన్న నాయకులు గ్రామ ప్రజలు యువకులు అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు పూలమాలలు వేసి స్వీట్ పంపించేసి జై భీమ్ తెలిపారు



