కోరుట్ల
బయో మైనింగ్, డ్రై రిసోర్స్ కలెక్షన్స్ సెంటర్ పరిశీలన

viswatelangana.com
April 17th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్ లోని డంపింగ్ యార్డ్ లో జరుగుతున్న బయో మైనింగ్ అలాగే డి ఆర్ సి సి డ్రై రిసోర్స్ కలెక్షన్స్ సెంటర్ ను కోరుట్ల మున్సిపల్ కమిషనర్ ఎ. మారుతి ప్రసాద్ పరిశీలించి, బయో మైనింగ్ జరుగుతున్న విధానాన్ని తెలుసుకొని వారికి సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. బయోమైనింగ్ ద్వారా డంపింగ్ యార్డ్ లోని చెత్తను ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎ.మారుతి ప్రసాద్, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మహేష్ అలాగే బయో మైనింగ్ సిబ్బంది పాల్గొన్నారు.



