జగిత్యాల పట్టణంలోని 1500 క్యూ ఆర్ కోడ్ తో అనుసంధానం:(ఎస్పీ అశోక్ కుమార్)

viswatelangana.com
ప్రయాణికుల సురక్షిత, భద్రత కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆటో రిక్షాల సర్వీసెస్ వాహన యాజమాన్యం నుండి అవసరమైన డాక్యుమెంట్లు, సమాచారం సేకరించి డిజిటలైజ్ చేసిన తర్వాత క్రోడీకరించిన సమాచారంను మై ఆటో ఈస్ సేఫ్ అప్ క్యూ ఆర్ కోడ్ ను జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ జిల్లా పోలీస్ గ్రౌండ్ లో శనివారం రోజు ప్రారంబించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో సుమారు 1500 ఆటో లకు (ఆటో ముందు, వెనక, డ్రైవర్ సీట్ వెనకాల ప్రయాణికులకు కనిపించే విధంగా) స్టిక్కరింగ్ చేయడం జరిగిందని రాబోవు కాలంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఆటోకు కూడా ఈ స్టిక్కరింగ్ చేయడం జరుగుతుందన్నారు. ప్రయాణికులు ఎవరైనా ఆటోలో ప్రయాణించే ముందు మొదటగా ఆ ఆటోకు “నా ఆటో సురక్షితంగా ఉంది” అనే స్టిక్కరింగ్ ఉందా అని గమనించాలని అన్నారు. ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ఆటో డ్రైవర్ మీతో అసభ్యంగా ప్రవర్తించిన, దురుసుగా మాట్లాడిన, మరేయితర సమస్యలు ఎదుర్కొన్న మీరు ప్రయాణిస్తున్న ఆటో డ్రైవర్ సీట్ వెనకాల క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసిన వెంటనే అట్టి ఆటో డ్రైవర్ కు సంబంధించిన పూర్తి సమాచారం మీ మొబైల్ నందు కనిపిస్తుంది వాటితో పాటుగా ఎమర్జెన్సీ కాల్,ఎమర్జెన్సీ కంప్లైంట్ ఆప్షన్స్ రావడం జరుగుతుందన్నారు. ఎమర్జెన్సీ కాల్ లేదా టెక్స్ట్ రూపంలో స్పందించినప్పుడు ప్రయాణికులు ప్రయాణిస్తున్న ప్యాసింజర్ వాహనం యొక్క లైవ్ లొకేషన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కి వెళ్తుంది వారు వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అందవేయడంతో వెంటనే స్పందించి వాహనం యెక్క లైవ్ లొకేషన్ కి చేరుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ “నా ఆటో సురక్షితంగా ఉంది” స్టిక్కరింగ్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ, ఆటో డ్రైవర్లకు అందించడం జరిగింది. స్వయంగా ఆటో లో కూర్చొని క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసిన అనంతరం వివరాలను తెలియజేశారు. ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవర్ ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తించిన, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హిట్ అండ్ రన్ చేసిన ఈ అప్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు అన్నారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వామ్యం కావాలని, ఆటో లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దు అని పరిమితి మించి ఎక్కించుకుంటే చర్యలు తీసుకుంటాం అన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం నేరం అని డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టు పడితే వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చెస్తామని అన్నారు.. ఈ కార్యక్రమంలో డిఎస్పి రఘు చందర్, ఆర్టీఓ టి శ్రీనివాస్, టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, రూరల్ సీఐ కృష రెడ్డి , మై ఆటో ఇస్ సేఫ్ అప్ రూపకర్త రమేష్ రెడ్డి, ఆర్ ఐ వేణు, ట్రాఫిక్ ఎస్. ఐ మల్లేశం, పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, ఓనర్స్ పాల్గొన్నారు.



