కథలాపూర్
ఊట్ పల్లి గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్

viswatelangana.com
August 15th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఊట్ పల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల క్రీడా మైదానంలో వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉండడానికి ఇలాంటి క్రీడలు దోహదపడతాయి, వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు టోర్నమెంట్ కు ఆర్థిక సహాయం చేసిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాచర్ల రవి, ముదం ప్రవీణ్, గజ్జల నవీన్, ప్రశాంత్, ప్రమోద్, జీవన్, చరణ్, అజయ్ రతీష్, వినయ్ లు పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.



