భగవద్గీత కు, భారత నాట్యశాస్త్రానికి యునెష్కో గుర్తింపు పై టి.వై.ఎం.ఎస్.ఈ.యు హర్షం…

viswatelangana.com
హిందువుల పవిత్ర గ్రంధం భగవద్గీతకు, భారత నాట్య శాస్త్రానికి యునెష్కో గుర్తింపు లభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ, పాఠ్యాంశాలలో భగవద్గీత ను చేర్చాలని ప్రధాన మంత్రి కార్యాలయం న్యూఢిల్లీకి, జగిత్యాల జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించినట్లు టివైఎంఎస్ఈయు రాష్ట్ర శాఖ పక్షాన రాష్ట్ర శాఖ అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్ తెలిపారు. అలాగే ఆర్టికల్ 30 ఎ లో సమానత్వం లోపించినదని అన్య మతస్థులు వారి వారి పాఠశాలల్లో వారి మతానికి సంబంధించినవి బోధించుకోవచ్చని హిందువులుమాత్రం తమ సనాతన ధర్మాన్ని బోధించుకోరాదని ఈ అసంబద్ధమైన ఆర్టికల్ 30 ఎ ను సవరించి పాఠశాలల్లో భగవద్గీతను ప్రవేశ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు, సునితావిలియమ్స్ తొమ్మిది నెలలు అంతరిక్షంలో తమకు భగవద్గీతనే మనోధైర్యాన్ని నిలిపిందని ఆమే తెలిపారని, ప్రపంచ ప్రఖ్యాతి గాంచి శాస్త వేత్త ఐన్ స్టీన్ ఈ గ్రంధం ఆదర్శం అని అన్నారని, శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన ఉన్నత వ్యక్తి జీవిత సారం, ఉన్నతమైన జాతీయ జీవన విధానానికి, విశ్వశాంతికి మూలం ఈ భగవద్గీత అని పేర్కొన్నారు. లోకాసమస్తా సుఖినోభవంతు, సర్వేజనా సుఖినసంతు, మాధవ సేవగా సర్వప్రాణి సేవ, స్వీయ ఆరాధన సర్వ ఆదరణ అనే ఆచరణాత్మకతను తెలియజేసే సనాతన ధర్మానికి మూలమైన పవిత్రమైన గ్రంధం ఈ భగవద్గీత అని వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు.



