కొడిమ్యాల

ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్ లో భాగంగా తిర్మలాపూర్ సందర్శన

viswatelangana.com

March 7th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో ట్విన్నిoగ్ ఆఫ్ స్కూల్ లో భాగంగా ఎంపీపీస్ రాంసాగర్ విద్యార్థులు ఎంపీపీఎస్ తిర్మలాపూర్, జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలను సందర్శించారు. ఇందులో భాగంగా విద్యార్థులు ఆయా పాఠశాలల్లో అమలు జరుగుతున్న కార్యక్రమాలను, అక్కడి విద్యార్థులు ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకున్నారు. ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమం, ఐ ఎఫ్ పి ద్వారా తరగతుల నిర్వహణను స్వయంగా చూడటం జరిగింది. టి ఎల్ ఎం. లను పరిీలించడం కూడా జరిగింది. విద్యార్థులకు పలు అంశాల గురించి ఉపాధ్యాయులు చక్కగా వివరించడం జరిగింది. తర్వాత ఆటలపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ప్రతిభ పాటవాలు ప్రదర్శించిన విద్యార్థులకు బహుమతి ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button