కోరుట్ల
బిజేవైయం పట్టణ అద్యక్షుడు సాయి చంద్ కు సన్మానం

viswatelangana.com
January 11th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలోని “శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయంలో” జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా శనివారం రోజున నిర్వహించిన వేడుకల్లో రాజకీయ రంగంలో సేవలందిస్తున్న యువ నాయకుడు, భారతీయ జనతా యువ మోర్చా పట్టణ అద్యక్షులు కలాల సాయి చంద్ ను కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, పాఠశాల నిర్వాహకులు శాలువతో ఘనంగా సత్కరించి మెమోంటోను అందజేశారు.



