రాయికల్
డిజిటల్ టెక్నాలజీ ద్వారా విద్యాబోధన

viswatelangana.com
March 15th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఆలూరు గ్రామంలోని ఎంపీ పీఎస్ పాఠశాలలో ఎఫ్ ఎల్ ఎన్ లో సీ గ్రేడ్ వచ్చిన విద్యార్థులకు అభ్యాసన సామర్ధ్యాలు మెరుగుపరుచుటకు, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించి డిజిటల్ టెక్నాలజీ ద్వారా విద్యా బోధనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నెక్కొండ రాంరెడ్డి, విద్యాభివృద్ధి కమిటీ చైర్మన్ చిలుక సంజీవ్, ప్రధానోపాధ్యాయులు అక్కినపెల్లి సతీష్, ఉపాధ్యాయులు సాయి కృష్ణ రమేష్ రెడ్డి శృతి పాల్గొన్నారు.



