తక్కళ్లపల్లి విద్యార్థులు హ్యాట్రిక్ సాధించాలి

viswatelangana.com
గత 15 సంవత్సరాలు గా SSC పరీక్షల్లో తక్కల్లపల్లి విద్యార్థులు 100 శాతం ఫలితాలు సాధిస్తున్నారు గత రెండు సంవత్సరాలు గా కథలాపూర్ మండలం లోనే కాకుండా కోరుట్ల డివిజన్ లోనే 100 శాతం ఫలితాలు సాధించిన ఏకైక ప్రభుత్వ పాఠశాల గా రికార్డ్ నెలకొల్పారు ఈ సంవత్సరం కూడా 100 శాతం ఫలితాలు సాధించి హ్యాట్రిక్ సాధించాలని నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లి మం: కోనాపుర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చౌ డారపు రాంప్రసాద్ తెలిపారు. కతలాపూర్ మం :తక్కలపల్లి ఉన్నత పాఠశాల పదవ తరగతి వీడ్కోలు సమావేశం లో మాట్లాడుతూ తక్కల్లపల్లి ఉపాధ్యాయులు పదవ తరగతి విద్యార్థుల కు ఉత్తమ బోధన చేస్తున్నారని విద్యార్థుల స్థాయి కి అనుగుణంగా గ్రూప్ లు చేయడం దత్తత తీసుకోవడం వేకప్ కాల్స్ ప్రతినెలా తల్లిదండ్రుల సమావేశం లో చర్చించరు మొదలైన వినూత్న కార్యక్రమాల ద్వారా 100 శాతం ఫలితాలు సాధిస్తున్న రని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోటూరి రవీందర్ మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడి కి గురి కాకుండా ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు రాయాలని తెలిపారు ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



