కొడిమ్యాల
తెలంగాణ మోడల్ స్కూల్ లో ప్యాడ్లు, పెన్నులు పంపిణీ

viswatelangana.com
March 17th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రం లోని తెలంగాణ మోడల్ స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలు మొదలవుతున్న సందర్భంగా వారికి ఉచితంగా పరీక్ష ప్యాడ్లు,పెన్నులను పంపిణీ చేసిన చొప్పదండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరి మహేష్, అనంతరం వారు మాట్లాడుతూ పరీక్షల్లో విద్యార్థులు ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా ప్రశాంతగా పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.



