కథలాపూర్

పుట్టినరోజు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన యువకుడు

viswatelangana.com

June 9th, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

పుట్టినరోజు అంటే విందులు, వినోదాలు, కేక్ కట్టింగ్ లు కాకుండా సిరికొండ గ్రామానికి చెందిన సేవ భారత్ స్వచ్చంధ సంస్థ సభ్యుడు అలకుంట అజయ్ తన పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలన్న ఆలోచనతో అత్యవసర సమయంలో తన రక్తం ఎవరికైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశ్యంతో పుట్టినరోజున స్వచ్చందంగా మెట్పల్లి పట్టణంలోని బ్లడ్ బ్యాంక్ కి వెళ్లి రక్తం ఇవ్వడం జరిగింది. పుట్టినరోజు సందర్భంగా స్వచ్చందంగా రక్తదానం చేసిన అలకుంట అజయ్ ని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది,రక్తదాతల అనుసంధాన కర్తలు, సేవ భారత్ స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకుడు కోడిపెల్లి అనిల్ రెడ్డి, ఎనుగందుల ఉదయ్ కుమార్, యువజన సంఘాల సభ్యులు, స్నేహితులు తదితరులు అభినందించారు.

Related Articles

Back to top button