కోరుట్ల
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీలలో కోరుట్ల విద్యార్థికి కాంస్య పతకం

viswatelangana.com
June 1st, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్ కేసర్ లో నిర్వహిస్తున్న 39వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ తైక్వాండో ఛాంపియన్ షిప్ 2025 లో కోరుట్ల పట్టణానికి చెందిన యండి ఖాజా సుభానోద్దీన్ కాంస్య పతకాన్ని సాధించారు. తేది : 2-3-2025 జిల్లా స్థాయిలో జరిగిన తైక్వాండో పోటీలలో బంగారు పతకం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు, మరియు 31/5/2025 నుండి 1-6-2025 జరుగుతున్న పోటీలలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభను కనబరిచి తన ప్రత్యర్ధులను చెమటలు పట్టించి కాంస్య పతకం సాధించారు. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రస్తాయి ఎస్జిఎఫ్ పోటీలలో పాల్గొని జగిత్యాల కోరుట్ల మండలం పేరును రాష్ట్ర స్థాయిలో వినిపించేలా పేరు ప్రతిష్టలను తీసుకు వచ్చిన ఖాజా సుభావోద్దీన్ ను పలువురు అభినందించారు.



