కోరుట్ల

మా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..

viswatelangana.com

August 15th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు జెండా ఆవిష్కరణ చేసారు. స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. మా ప్రెస్ క్లబ్ ఏర్పడి ఇప్పటికి సుమారు రెండు సంవత్సరాలు అవుతుందని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా సమాజానికి ఉపయోగపడే వార్తలేన్నో మా ప్రెస్ క్లబ్ కు చెందిన విలేకరులు రాస్తున్నారని అభినందించారు. ముందు ముందు ఇలాగే సమాజానికి ఉపయోగపడే వార్తలు రాయాలని అన్నారు. మా ప్రెస్ క్లబ్ కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని, ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉండి అన్ని రకాలుగా మీకు అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, కోరుట్ల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజాం, కాంగ్రెస్ నాయకులు ఆడేపు మధు, మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం వేణుగోపాల్, కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు సత్యనారాయణ, మా ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు చిలువేరి లక్ష్మీరాజం, ఉపాధ్యక్షులు మీర్జా ముక్రం బేగ్, ప్రధాన కార్యదర్శి పైడిమల్ల రాజు, కోశాధికారి దాసరి రమేష్, జాయింట్ సెక్రటరీ ఎండి జాకీర్ హుస్సేన్, తీగల శోభన్ రావు, సెల్వాజి రాజా రమేష్, మహమ్మద్ రఫీ. సల్ల మహేష్, న్యావనంది రమేష్, నీలగిరి ప్రవీణ్ రావు, మచ్చ రాఘవేంద్ర, ద్యావాన్ పెల్లి సాయి కుమార్, జమీల్, అజార్, పాషా, పాతర్ల నరేష్, ఖలీల్, పాషా తదితర పాత్రికేయులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button