రాయికల్
తెలంగాణ వీరనారి శ్రీమతి చిట్యాల ఐలమ్మ 129వ జయంతి

viswatelangana.com
September 26th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో గల చాకలి ఐల్లమ్మ విగ్రహనికి రజక సంఘం అధ్యర్యంలో పూలమాల వేసి 129 వ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతు నిజాం నిరంకుశత్వానికి ఎదురునిలిచి, రజాకార్ల ఆగడాలకు అడ్డునిలిచి, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పేద ప్రజల పక్షాన పోరాటం చేసి దున్నేవాడిదే భూమి అనే నినాదంతో భూమి లేని నిరుపేదలకు లక్షల ఎకరాల భూమి పంచి పేదల గుండెల్లో నిలిచిన వీర వనిత చాకలి ఐలమ్మా అని అన్నారు. 4వ వార్డు కౌన్సిలర్ తురగ శ్రీధర్ మాట్లాడుతూ చాకలి ఐల్లమ్మ పోరాటం అందరికి స్ఫూర్తిదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో రాజు, భూమయ్య, గంగాధర్, శ్రీను, రమేష్, గంగాధర్, సాయిలు, రాజాం, శ్రీను, గంగాధర్, మహేష్ వెంకటేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



