కథలాపూర్
ఊట్ పల్లిలో బిజెపి ఇంటింటి ప్రచారం
viswatelangana.com
April 16th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ ని గెలిపించాలని కోరుతూ బిజెపి నాయకులు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. మూడోసారి దేశ ప్రధానమంత్రి గా నరేంద్ర మోడీ రావాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ కేంద్రంలో చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు కరపత్రం ద్వారా వివరించుకుంటూ ఇంటికి స్టిక్కర్ వేస్తూ ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి గ్రామశాఖ బూత్ కమిటి కార్యకర్తలు ఎ జి బి నరేష్, కో ఆర్డినేటర్ బల్గం రవి, సెక్రటరీ సిహెచ్ వెంకటేశ్వర్లు, మరియూ గంగాధర్, శేఖర్, సాగర్, గంగరాజం, పాల గంగన్న బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



