ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు
ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్

viswatelangana.com
గత ముప్పై సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ పోరాటాలకు ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 2025 ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బిల్లుకు సహకరించిన ప్రతిపక్ష పార్టీలకు తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ, అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం కోరుట్లలోని టిపిఎస్ జేఏసీ కార్యాలయంలో పేట భాస్కర్ మాట్లాడుతూ జస్టీస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ నివేదికను అమోదించిన ప్రభుత్వం ఎస్సీ 59 కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరణ చేసి అసెంబ్లీలో బిల్లు తెవడం దానికి చట్టబద్ధత కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఉద్యమకాలంలో మరణించిన మాదిగ ఆమరవీరుల కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్ల లో, రాజీవ్ యువవికాస్ లో మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం అభినందనీయమని పేట భాస్కర్ తెలిపారు. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఉద్యోగాల నియామకాలతో పాటు అన్ని రంగాల్లో వర్గీకరణ అమలు జరుగుతుందన్నారు. వర్గీకరణ పోరాటంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కృషి భవిష్యత్తు తరాలకు స్పూర్తి దాయకమని, ఎమ్మార్పీఎస్ మొదటి తరం ఉద్యమ నాయకులతో పాటు ప్రస్తుత నాయకులకు ఎస్సీ వర్గాలకు పేట భాస్కర్ శుభాకాంక్షలు తెలిపారు.



