కోరుట్ల

గుగ్గిళ్ళ సురేష్ గౌడ్ ను పరామర్శించిన జువ్వాడి నర్సింగ్ రావు

viswatelangana.com

September 3rd, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల మండలంలోని యూసుఫ్ నగర్ గ్రామంలో ఇటీవలే కుక్క అడ్డు రావడం వల్ల ప్రమాదానికి గురై కుడి కాలుకి శస్త్ర చికిత్స జరిగి విశ్రాంతి తీసుకుంటున్న జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ గుగ్గిళ్ళ సురేష్ గౌడ్ ని ఆయన నివాసం వెళ్లి పరామర్శించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు అన్నం అనిల్ గౌడ్, కేడీసీసీ జిల్లా డైరెక్టర్ భూమా రెడ్డి, కౌన్సిలర్ లక్మి నారాయణ, కోఆప్షన్ సభ్యులు మాధవ రెడ్డి, ముక్కెర లింబద్రి, స్థానిక మాజీ ఎంపీటీసీ గుగ్గిళ్ళ ప్రియాంక, నాయకులు నరేష్, శ్రీనివాస్, అంజయ్య, సాయి, తదితరులు పాల్గొన్నారు..

Related Articles

Back to top button