మన ప్రెస్ క్లబ్ కోరుట్ల పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు మెసేజ్ లు పెట్టిన వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
viswatelangana.com
మన ప్రెస్ క్లబ్ కోరుట్ల పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు మెసేజ్ లు పెట్టిన వారిపై చట్టారీత్యా తగు చర్యలు తీసుకోవాలని శనివారం కోరుట్ల పోలీస్ స్టేషన్ లో స్టేషన్ హౌజ్ ఆఫీసర్ కిరణ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.మన ప్రెస్ క్లబ్ కోరుట్ల రిజిస్ట్రేషన్ నెంబర్ 111/2024 అను పాత్రికేయుల సంఘం పేరుతో రాష్ట్ర రాజకీయ విశ్లేషణ వాట్సాప్ గ్రూపులో ఇతరులను మేము అనగా మన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి కించపరిచినట్లు మా కార్యవర్గం ఫోటోతో రాష్ట్ర రాజకీయ విశ్లేషణ వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పెట్టారు. అట్టి మెసేజ్ కు మన ప్రెస్ క్లబ్ కోరుట్ల కు ఎలాంటి సంబంధం లేదు. అలాంటి తప్పుడు మెసేజ్ ద్వారా, మా ఫోటోలు వాడుకోవడం ద్వారా ప్రజల కు మాపై చెడు సంకేతాలు వెళ్లడంతో పాటు మాపై చెడు ప్రభావం పడే అవకాశం ఉన్నందున ,పాత్రికేయ వృత్తిలో ఉండి ఇలాంటి మెసేజ్ లు పెట్టడం ఏంటని పలువురు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆరోపించే అవకాశాలు ఉన్నందున, అలాంటి తప్పుడు మెసేజ్ పెట్టిన వారి పై చట్టరీత్య తగు చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ కు మన ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మన ప్రెస్ క్లబ్ కోరుట్ల అధ్యక్షులు ఉరుమడ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అల్లె రాము, మన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు కత్తిరాజ్ శంకర్, గుడిసె కోటేష్, వనతడుపుల నాగరాజు, మిట్టపల్లి బుచ్చిరెడ్డి, దయా మదన్ తదితరులున్నారు.



