నిరుద్యోగ విద్యార్థి ఉద్యమాలు చేసే వారికి పట్టం కడద్దాం
సమస్యల పట్ల అవగాహన ఉన్న వారిని ఎమ్మెల్సీ గా ఎన్నుకుందాం

viswatelangana.com
నిరుద్యోగ విద్యార్థి సమస్యలపై పోరాటం చేసి వారి సమస్యల పట్ల అవగాహన ఉండి వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే నీతి నిజాయితీ స్వార్థం లేని వారినే పట్టభద్రుల ఎన్నికలలో ఎమ్మెల్సీగా గెలిపిద్దాం అని నగరంలోని స్థానిక పట్టణములో గల రామ కృష్ణ డిగ్రీ కళాశాలలో పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కేశి పెద్ది శ్రీధర్ రాజు అన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి పట్టభద్రులు విధిగా కర్తవ్యంగా ఓటరు నమోదు చేసుకోవాలని కోరారు. అది మన బాధ్యత అని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పరిధిలోని పట్టభద్రులు అందరు నమోదు చేసుకోనే విధంగా చైతన్య కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిరుద్యోగ విద్యార్థి సమస్యలపై గలమెత్తిన వారిని పట్ట భద్రుల ఎమ్మెల్సీ గా ఎన్నుకుందామని కోరారు. కేవలం ఎన్నికల కొరకు నిరుద్యోగ విద్యార్థులపై ప్రేమలు చూపించే నాయకు లను నమ్మవద్దని ఈ సందర్భంగా కోరారు. శాసనమండలిలో సమస్యలను ప్రశ్నించే సత్తా ఉండే నాయకులనే ఎన్నుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిసి యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శికారి గోపికృష్ణ, కరీంనగర్ జిల్లా బిసి సంక్షేమ సంఘం కన్వీనర్ మియాపురం రవీంద్ర చారి, బిసి యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తుమ్మన పెల్లి రాజేంద్రప్రసాద్, రామకృష్ణ డిగ్రీ పి జీ కళాశాలల ప్రిన్సిపాల్ గ్రాడ్యుయేట్స్ బెజ్జారపు ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



