కోరుట్ల
నీటి సరఫరాకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వెంటనే చేయాలని కమిషనర్ కి వినతి పత్రం

viswatelangana.com
February 3rd, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలోని మిషిన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్లు రాకపోవడం వల్ల ప్రజలందరికీ తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రతిరోజు దిన చర్యలోభాగమైన నీళ్లు అందకపోవడంతో ఇంటి అవసరాలు తీర్చుకోవడం ఇబ్బందికరంగా మారింది. గత ఐదు రోజులుగా మిషన్ భగీరథ పైప్ లైన్లుమరమ్మత్తుల కారణంగా మున్సిపల్ నుండి రెండే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. కానీ ఈ రెండు ట్యాంకర్ల ద్వారానే ప్రజలకు అవసరమయ్యే నీటి ఎద్దడిని తీర్చడం ఇబ్బంది కరం పట్టణంలోని జనాభాని దృష్టిలో పెట్టుకొని ప్రజల దాహర్తిని తీర్చడానికి కోరుట్ల పూలు వాగులోని పంపు హౌస్ ద్వారా మిషన్ భగీరథ పైపు లైన్లకి లింకు కలిపి నీటి సరఫరా చేయడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పెండెం గణేష్ మున్సిపల్ కమిషనర్ ని కోరారు.



