viswatelangana.com
ధ్యానంతో మానసిక, శారీరక సమస్యలు దూరమై మనకు పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని హార్ట్ ఫుల్ నెస్, రామచంద్ర మిషన్ ట్రైనర్ హరికృష్ణ పేర్కొన్నారు. హార్ట్ ఫుల్ నెస్ సంస్థ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలోని వాసవి కళ్యాణ భవనంలో 3 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. మొదట నిర్వాహకులు మంచాల కృష్ణ మాట్లాడుతూ హార్ట్ ఫుల్నెస్ సంస్థ లక్ష్యాలను పరిచయం చేశారు. ధ్యాన శిక్షకులు హరికృష్ణ మాట్లాడుతూ ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికతతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. మన ప్రస్తుత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండడానికి ధ్యానం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కేఎల్ఎన్ కృష్ణ, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మోటూరి రాజు, పడిగెల శ్రీనివాస్, బట్టు హరికృష్ణ, నీలి కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.



