కథలాపూర్
చదువుతో కాదు దోమలతో కుస్తీ పడుతున్న విద్యార్థులు

viswatelangana.com
March 14th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్పల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఆవరణలో గుంత నీరుతో నిండిపోయింది అందులో నీరు నిలిచి పోవడం వల్ల దుర్వాసన రావడమే కాకుండా కుప్పలు కుప్పలుగా దోమలు చేరుతున్నాయి . విద్యావంతులను తయారు చేసే బడిలో. దోమల తయారి కేంద్రంగా మారింది ఆ కుంట. స్కూల్లో చదువుతున్నంత సేపు దోమలు వారిపై దాడి చేస్తున్నాయని సగం టైం దోమల నుండి తప్పించుకోవడానికి సరిపోతుంది అని విద్యార్థులు చెప్తున్నారు. అక్కడే ఆడుతున్న క్రీడాకారులపై ప్రభావం చూపుతున్నాయిగుంత తొలగించి, దోమల వృద్ధిని అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. దోమకాటుతో అనారోగ్యానికి విద్యార్థులు క్రీడాకారులు గురైతారని ఇప్పటికైనా. ఆ కుంట పై దృష్టి సారించాలని తల్లిదండ్రులు క్రీడాకారులు కోరుతున్నారు



