కథలాపూర్
పటేల్ యూత్ ఆధ్వర్యంలో కట్ట మైసమ్మ, దుర్గమ్మ లకు బోనాలు

viswatelangana.com
June 19th, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలో పటేల్ యూత్ ఆధ్వర్యంలో కట్ట మైసమ్మకు మరియు దుర్గమ్మ కు బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. పటేల్ యూత్ సభ్యులు మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురిసి చెరువులు, కుంటలు రిండి పాడిపంటలతో రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటేల్ యూత్ అధ్యక్షులు ఎజీబీ గణేష్, నలుమల రాజు, ఉపాధ్యక్షులు జవ్వాజి శేఖర్, పొలస గంగానర్సయ్య కోశాధికారి తొగరి రాజేంధర్ మున్నూరు కాపు సంఘ సభ్యులు, పటేల్ యూత్ సభ్యులు మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు



