మన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వైభవంగా మహా అన్న ప్రసాదం వితరణ

viswatelangana.com
మన ప్రెస్ క్లబ్ కోరుట్ల ఆధ్వర్యంలో ద్వితీయ సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా అర్చకులు బ్రహ్మన్న గారి శంకర్ శర్మ నేతృత్వంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ పూజా కార్యక్రమాలు మన ప్రెస్ క్లబ్ సభ్యుల సమక్షంలో నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్ హాజరై స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్న కౌన్సిలర్ దాసరి రాజశేఖర్ అన్న ప్రసాదానికి కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కేర చంద్రశేఖర్,ప్రధాన కార్యదర్శి ఆకుల మల్లికార్జున్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అన్నం అనిల్ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇట్టి అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు చౌల నవీన్, వేముల పరంధామ్, టైగర్ అలీ నవాబ్, విజయ్ పాటిల్, గంగాధరి రాజేంద్రప్రసాద్, గిన్నెల శ్రీకాంత్, హాజరవగా వారికి మన ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉరుమడ్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు, కొండ్లేపు అర్జున్, లింగ ఉదయ్ కుమార్, ఉత్సవ కమిటీ కన్వీనర్ వనతడుపుల నాగరాజు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు సైదుగంగాధర్, గుడిసె కోటేష్, కోడూరి ప్రేమ్ కుమార్, బాలే అజయ్, వన తడుపుల సంజీవ్, కట్టెకోల సురేష్, చింతోజి రాధాకృష్ణ, మచ్చ రాఘవేంద్ర, కొయ్యాల్కర్ ప్రవీణ్, సంగ మహేష్, బచ్చు వంశీ కృష్ణ, మిట్టపల్లి బుచ్చిరెడ్డి, మంచి కట్ల విజయ్ తదితరులున్నారు.



