కోరుట్ల
పదవ తరగతి పరీక్ష కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి
- ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాడవేని సునీల్

viswatelangana.com
March 20th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
ఏబీవీపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాడవేని సునీల్ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల కేంద్రాలలో విద్యా ర్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, పరీక్షలు రాసే విద్యా ర్థులకు పరీక్ష కేంద్రాలలో త్రాగు నీరు సదుపాయం కల్పించాలని, రూంలలో పరిశుభ్రత పాటించాలని కోరారు. అలాగే విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు పరీక్ష సమయాలు దృష్టిలో పెట్టుకొని ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని. విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా నిశ్చింతగా తాము చదివిన జవాబు పత్రాలలో వ్రాయలని సూచించారు, అదేవిధంగా పరీక్షలు భయంతో కాకుండా బాధ్యత తో వ్రాయాలని అన్నారు విద్యార్థులకి త్రాగు నీరు, ఏర్పాటు చేయాలనీ పాఠశాల యాజమాన్యాలను కోరారు 10వ తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.



