కోరుట్ల

గల్ఫ్ బాధితులకు ప్రవాసి ప్రజావాణి ప్రత్యేక కౌంటర్

viswatelangana.com

September 25th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

ప్రజాభవన్ లో గల్ఫ్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన ప్రవాసి ప్రజావాణి ప్రత్యేక కౌంటర్ ను రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉత్తర తెలంగాణలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ప్రారంభించనున్నట్లు సిఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెన్నమనేని శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేపట్టిన నుండి నేటి వరకు కోరుట్ల నియోజకవర్గ గల్ఫ్ బాధిత కుటుంబ సభ్యులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న గల్ఫ్ బాధిత కుటుంబ సభ్యులకు రవాణా సౌకర్యము భోజన వసతిని కూడా ఏర్పాటు చేసినట్లు సిఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత కాంగ్రెస్ నాయకులు చెన్నమనేని శ్రీనివాసరావు తెలిపారు.

Related Articles

Back to top button